పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె యుక్తాయుక్త విచక్షణ గలదని తెలిసి, గృహకృత్యము లామె చేతిమీద జరుగుట కత డొప్పుకొనెను.

1775 సంవత్సరము మార్చి 21 తేదిని బెంజమిను నింగ్లాండునుండి బయలుదేరి, మేయి నెల 5 తేదిని ఫిలడల్‌ఫియాలో వచ్చి చేరెను.

స్వస్తి.

కొంతకాలము వఱ కితడు రాజకీయ వ్యవహారములలో మెలగు చుండెను. సంబంధ బాంధవ్యములలో నెట్టి కలతలు లేక యుండెను. కొన్ని సంవత్సరములకుముందు కట్టుట కారంభముచేసిన గృహనిర్మాణము ముగిసినందున, దానిలోనితడు ప్రవేశించెను. దానిలో నొకగదిలో పుస్తక భాండాగార ముంచబడెను. "నా పిల్లలు, కూతురు, మనుమలాఱుగురు వీరితో కలిసి కాలమును నేను గడుపుచున్నాను. నా పెద్దమనుమడు కళాశాలలో జదువుకొనుచున్నాడు. కడమవారు మంచిస్వభావము కలవారు వీరు పెద్దవారై, ప్రపంచములో దిగిన తరువాత, నే నడవడికలవారగుదురో, నేను వానిని జూచుటకు జీవించను; వానిని ముందుకు జూచి చెప్పలేను. కనుక, నీకాలమును వారితో నెమ్మదిగ, నడు