పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'న్యూపోర్టు'లోనే వ్యాపారముచేయుచుండెను. చదువు ముగిసినపైని, కుమారుడు తల్లియొద్దకు వెళ్లెను.

బెంజమిను ఫిలడల్‌ఫియాలో స్వంతపనులను జూచుకొనుచు, స్వగ్రామస్థులచే మన్ననలను బొందెను. 1736 సంవత్సరములో "సామాన్య ప్రజాసభ"కు లేఖకునిగ, బెంజమినును నియోగించిరి. ఫెన్సిలువానియాలో నితడే మతిమంతుడు. ఈ యుద్యోగము వలన ధనము దొరకక పోయినను రాష్ట్రము వారి ముద్రక పనులను జూచుటచేత, నితనికి లాభము గలిగెను. ఈ పనిలో బదునాలుగు సంవత్సరము లత డుండెను. ఫిలడల్‌ఫియాలో 'పోస్టుమాస్టరు'గ నియోగింప బడినందున, దేశములోని సమాచారములను తెలిసికొనుట కితనికి వీలుపడి, తన వార్తాపత్రికను విశేషముగ విస్తరింప జేసెను. నేడు మొదలవిచ్ఛిన్నముగ నితడు శరీరయాత్రను గడిపెను.

ఆత డంతరంగమున జరిపిన జీవిత చరిత్రమతియాహ్లాదకరముగ నుండును!