పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలరు". "నీవు దుకాణము నుంచుము - దుకాణము నిన్నుంచును". "వక్తయొక్కమాటలు పూర్ణ స్వానము, తెలివి పూర్ణానుస్వారము". "నీవు చెప్పిన సంగతులను విని, యామె నవ్వుచున్నది. ఎందు చేతను? ఆమెకు మంచిదంతములు కలవు". "చుట్టము, చూపులకు వచ్చినవారు, చేపలు మూడురోజులలో కంపుగొట్టును". "రోగము కుదుర్చు వాడు దైవము, కట్నము పుచ్చుకొనువాడు వైద్యుడు". "నమ్మకమైన స్నేహితులు మువ్వురు - ముసలిభార్య, ముసలికుక్క, రొక్కము ధనము" "వివాహమునకు ముందు కండ్లు తెఱచియుండుము; తరువాత, సగము వానిని మూయుము".

పది సంవత్సరములకు, స్వగ్రామమునకు బెంజమిను వెళ్లెను. జీవిత కాలములో ప్రతి పదిసంవత్సరముల కొక పర్యాయము అతడు స్వగ్రామమునకు వెళ్లుచుండెను. తిరుగుదలలో న్యూపోర్టుకు వచ్చి, తనయన్న నితడు చూచెను. పూర్వపు మనస్పర్థలు మఱచి, కొంతకాల మన్నదమ్ములు కలసి మెలసి యుండిరి. జేమ్సు ఫ్రాంక్లిను జబ్బుగనున్నందున, నతడు తన కుమారుని తమ్ముని కప్పగించెను. ఆ ప్రకారమే, వానికి చదువు చెప్పించి, ముద్రకుని వ్యాపారమును బెంజమిను నేర్పెను. ఇంతలో జేమ్సు కాలధర్మమునొందినందున, నతని భార్య