పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము

స్వయంకృషి


పుస్తక భాండాగారములోని పుస్తకము లన్నియు బెంజమిను చదివెను. ఇతను మొదట దేశ చరిత్రలను, మహాపురుషుల జీవన చరిత్రములను, జదివినటుల గనబడుచున్నది. "చరిత్రపఠనోద్భాసితాభిప్రాయము" లను నొక వ్యాసము నితడు వ్రాసెను. ఏబది సంవత్సరము లైరోపాలోని రాజుల దివాణ వ్రాసిన విధమున నీ వ్యాసము వ్రాయబడినదిగాని, నూతన సీమలలో స్వానుభవము లేని పడుచువాడు వ్రాసినట్లు కనబడదు. ఈ వ్యాసము చాలకాలము ప్రచురములేక పడియుండెను.

ధర్మాత్ముల నందఱిని సమాహూయముచేసి, యొక సంఘమును స్థాపించవలెనని బెంజమిను యత్నించి, తన స్నేహితులతో నీ సంగతిని ముచ్చటించ, వారందు కంగీకరించిరి. "ముక్తులు - స్వాస్థ్యులు సంఘము" అని దీనికి బేరుపెట్టుట కితను తలచెను. ముక్తులన, పాపము, ఋణములనుండి ముక్తిని పొందినవారు. ఈ రెండు బాధలు లేనందున, స్వాస్థ్యులు. మున్ముందుగ