పుట:Bappadu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


ఊరి బయటీ ఉద్యానవనములో
చొచ్చిరి ముచ్చటగా ఆ పిల్లలు.
చొచ్చి అచ్చటను విచ్చలవిడిగా
ఎచ్చటను చూచినా తామే ఐ,,
వచ్చినచోటి కెవచ్చుచుచు తిరిగీ
పోయిన చోటికె పోవుచు మరియూ
తోట ఎల్ల ఎగిరి పోవు నట్లుగ
గొల్లున హాస్యపు మాటల' నాడుచు
హాస్యములకు పకపకమని నవ్వుచు
ఒండొరులను "ఓ" "ఓ" అని పిలుచుచు
తోట నడిమి మర్రిచెట్టు కిందకు
డోలిక' లూగగ బాలిక' లేగిరి.
చెట్టు కొమ్మ' కుయ్యెలు కట్టుటకై
గట్టి తాడు ఎవ తె తెచ్చెనో అని
అందరూ ఒక్కమారే అడిగిరి.
కాని అయో పొషము! ఆ పిల్లలు
మాట సందడిని మనువు మరచి' నటు
ఆట సందడిని తాటిని మరచిరి.
ఆమె తెచ్చు' నని ఈమె తేకుండ
ఈమె తెచ్చు' నని ఆమె తేకుండ
మొత్తమునకు ఎవరూ తేకుండా
ఉత చేతులను ఊపుకొనుచు, ఎటు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/5&oldid=344729" నుండి వెలికితీశారు