పుట:Bappadu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


మిలమిలలాడే మేలిమి పైటలు,
రకరకములు గల మొకమలు రైకలు
ఇవే ఆ పిల్లల దుస్తులు; ఆ పై
గుండ్రని మొగముల కుంకుమ బొట్టులు,
కన్నుల నిండా కాటుక రేఖలు,
జడలలోన కురు వేరూ దమనము,
చెవుల కొనల దుమి కే జుమికీలూ,
పైటలపై తుళే హారాలూ,
చేతుల గుత్త పు గాజుల తొడుగులు,
మొలలను గంటల ఒడ్డాణాలూ,
కాళ్లయందు చిరు మువ్వల అందెలు,
ఇట్లు వస్తువులతో ముస్తీ బై
"వస్తారా" అని ఒండొరు పిలుచుచు,
గవ్వ గుత్తి వలె గలగలలాడుచు,
చిలుకల వలె కలకలమను వారూ
కిలకిల నవ్వుచు కే రేవారూ
పిల్ల లేళ్ల వలె గం తే వారూ
దారిలోని తూనీగలు బెదరగ
చిన్ని చప్పట్లు చర చే వారూ
గడ్డి పువ్వులను కోసే వారూ
ఆయి. పదుగు రేసి ఒక్కొక జట్టుగ
చెట్టాపట్టీలు కట్టుకొని తమ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/4&oldid=344730" నుండి వెలికితీశారు