పుట:Bappadu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

.శ్రీ

.

బప్పడు.


శ్రీ రాజస్థాన దేశ మందలి
నా గేంద్ర పురగామములో గల
రాజకుటుంబపు చిన్ని బాలికలు
డోలిక' లూగుటకై పయన' మైరి.
అట్లతద్ది అద్దినమునను గనుక
పొద్దుటనే చద్ది ముద్దలను తిని
ముద్దులు మురిపెములును కురిపించుచు
ఐదు వందలో ఆరు వందలో
పది పండెం, డేడుల ఈడును గల
సిగ్గును తెలియని చిన్ని బాలికలు
వచ్చీ రానీ ఒయ్యారముతో
పెండ్లి కాకుండినా సరదాపడి
వడి వడి తోటకు నడువగ దొడగిరి.
గరగరలాడే పట్టు గాగరాల్ ,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/3&oldid=344727" నుండి వెలికితీశారు