పుట:Balavyakaranamu018417mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుతింతు నెపుడు - శుభవిధాయుల రామకృష్ణుల భజింతు - భువనవంద్యను రుక్మిణిఁ బ్రస్తుతింతు.

20. స్త్రీసమంబులగు విశేషణంబులయు మువర్ణకాంత విశేషణంబులయు బహువచనంబున కేకవచనంబు బహుళంబుగానగు.

మాటలు పెక్కేల - మాటలు పెక్కు నేల. కులిశధార ల్కుంఠింతం బయ్యె - కులిశధారల్కుఠితంబు లయ్యె. ఇష్టమగు పదార్థములు - ఇష్టములగు పదార్థములు.

21. ఒకానొకచో నొక విభక్తికి మఱియొక విభక్తియు నగు.

మైత్రుండు గృహమున వెడలెను - గృహమునుండి యని యర్థము. వాఁడు వాహనమును దిగెను - వాహనమునుండి యని యర్థము. వారు సుఖమున్నారు - సుఖముతో నని యర్థము. ఇత్యాదులెఱుంగునది.

22. జడంబు తృతీయా సప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు.

రాముఁడు వాలినొక్క కోలంగూలనేసె - కోలతో నని యర్థము. లంకం గలకలంబు పుట్టె - లంకయందని యర్థము. బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందెయగు. అర్జునుండు శత్రుసేనలను బాణంబులను రూపుమాపె - బాణములచే నని యర్థము. మీనంబు జలంబులనుండు - జలంబులందని యర్థము.