పుట:Balavyakaranamu018417mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కువర్ణకంబును గొన్ని యెడల సంబంధంబునం దగు. నాకుం దమ్ముఁడు - మీకు నెచ్చెలి.

16. నిర్ధారణషష్ఠికి లోపల వర్ణకంబగు.

జాతి గుణ క్రియా సంజ్ఞలచేత సముదాయంబునుండి యేకదేశంబునకుం బృథక్కరణంబు నిర్థారణం బనంబడు. ఎద్దానివలన నిర్థారణంబగు నచ్చటి షష్ఠికి లోపల వర్ణకం బగునని యర్థము. మనుష్యులలోపల క్షత్రియుండు శూరుండు - గోవుల లోపలఁ గపిల బహుక్షీర - అధ్వగుల లోపలం బాఱువాఁడు శీఘ్రగామి - ఛాత్రులలోపలఁ మైత్రుండు సమర్థుండు. ఇచట సప్తమియు గలదు. మనుష్యులయందు క్షత్రియుండు శూరుండు. ఇత్యాదులెఱుంగునది.

17. అధికరణంబునకు సప్తమి యగు.

అధికరణంబు నానాధారంబు. ఔపశ్లేషికంబు వైషయికం బభివ్యాపకంబని యాధారంబు త్రివిధంబు. ఘటమందు జలమున్నది - మోక్షమం దిచ్ఛ గలదు - అన్నిటియం దీశ్వరుండు గలడు.

18. ఉకారాంత జడంబునకు నవర్ణకం బగు.

ఘటంబున జలంబున్నది - దేవదత్తునకు మోక్షమున నిచ్ఛ గలదు.

19. విశేష్యంబునకుంబోలె విశేషంబునకు లింగవిభక్తి వచనంబు లగు.

నందతనయుండు కృష్ణుండు నాకు దిక్కు - దేవకీపుత్రు హరిని