పుట:Balavyakaranamu018417mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నలుఁగడాదులు నీ యాగమంబు లేదండ్రు. ఈ యాగమంబొకా నొకచోట స్థిరంబు పరంబగుచోఁ గానంబడియెడి. గఱునపున్మురువు.

26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు.

27. తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు.

తలఁబ్రాలు - ఒడిఁబ్రాలు - సేసఁబ్రాలు - ఊరఁబంది - ఊరఁబిచ్చిక - తోడఁబుట్టువు - తోఁబుట్టువు - ఒల్లన్‌బాటు - ఒడఁబాటు ఇత్యాదులు.

28. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమం బగు.

కఱకు ... అమ్ము ... కఱకుటమ్ము

నిగ్గు ... అద్దము ... నిగ్గుటద్దము

సరసపు ... అలుక ... సరసపుటలుక

29. కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు.

పేరు ... ఉరము ... పేరటురము, పేరురము