పుట:Balavyakaranamu018417mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిగురు ... ఆకు ... చిగురుటాకు, చిగురాకు

పొదరు ... ఇల్లు ... పొదరుటిల్లు, పొదరిల్లు

30. పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు.

పేద ... ఆలు ... పేదరాలు

బీద ... ఆలు ... బీదరాలు

పేద - బీద - ముద్ద - బాలింత - కొమ్మ - జవ - అయిదవ - మనుమ - గొడ్డు ఇట్టివి పేదాదులు. ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెఱుంగునది. "ఏకాంతమునందు నున్న జవరాండ్ర" నని ప్రయోగము.

31. కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపు డత్వంబున కుత్వంబును రుగాగమంబు నగు.

ధీర ... ఆలు ... ధీరురాలు

గుణవంత ... ఆలు ... గుణవంతురాలు

ఇచట వృత్తియం దాలుశబ్దము స్త్రీమాత్రపరము.

32. కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు.