పుట:Balavyakaranamu018417mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు.

25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు. సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు.

చిగురు ... కయిదువు ... చిగురుంగయిదువు, చిగురుఁగయిదువు, చిగురున్గయిదువు

తళుకు ... గజ్జెలు ... తళుకుంగజ్జెలు, తళుకుగజ్జెలు, తళుకున్గజ్జెలు

సింగపు ... కొదమ ... సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింగపున్గొదమ

ఉన్నతంపు ... గొడుగు ... ఉన్నతంపుంగొడుగు, ఉన్నతంపుగొడుగు, ఉన్నతంపున్గొడుగు