పుట:Balavyakaranamu018417mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱ డ ల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారం బగు.

కుఱు ... ఉసురు ... కుట్టుసురు

చిఱు ... ఎలుక ... చిట్టెలుక

కడు ... ఎదురు ... కట్టెదురు

నడు ... ఇల్లు ... నట్టిల్లు

నిడు ... ఊరుపు ... నిట్టూరుపు

13. ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు.

వాఁడు ... కొట్టె ... వాఁడు గొట్టె, వాఁడు కొట్టె

అపుడు ... చనియె ... అపుడు సనియె, అపుడు చనియె

నీవు ... టక్కరివి ... నీవు డక్కరివి, నీవు టక్కరివి

మీరు ... తలఁడు ... మీరు దలఁడు, మీరు తలఁడు

వారు ... పోరు ... వారు వోరు, వారు పోరు

అపు డిప్పు డెప్పు డను శబ్దములు నిత్యైక వచనాంతములు. వాగనుశాసనులు యదాతదా యని గ్రహించుట ప్రపంచార్థ