పుట:Balavyakaranamu018417mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు.

ద్విరుక్తము యొక్క పరరూప మామ్రేడిత మనంబడు. తఱచుగ ననుటచేత నొకానొకచోట వైకల్పిక సంధియుం గలదని తాత్పర్యము.

ఔర ... ఔర ... ఔరౌర.

ఆహా ... ఆహా ... అహాహా.

ఎట్టూ ... ఎట్టూ ... ఎట్టెట్టూ.

ఓహో ... ఓహో ... ఓహోహో.

ఏమి ... ఏమి ... ఏమేమి, ఏమియేమి.

ఎగి యేగి యనుచోఁ గ్త్వార్థంబగుట సంధిలేదు.

11. అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.

మూర ... ఎఁడు ... మూరెఁడు

వీసె ... ఎఁడు ... వీసెఁడు

అర్థ ... ఇంచు ... అర్థించు

నిర్జి ... ఇంచు ... నిర్జించు

అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది. రాములందు - రాములయందు - హరియందు - ఎనిమిదవది - ఎనిమిదియవది.