పుట:Balavyakaranamu018417mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని యెఱుఁగునది. ఈ కార్యము కళలగు క్రియా పదముల మీఁద సహితము కానంబడియెడి.

రారు ... కదా ... రారు గదా, రారు కదా

వత్తురు ... పోదురు ... వత్తురు వోదురు, వత్తురు పోరుదు

14. తెనుఁగుల మీఁది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు.

వాఁడు ... కంసారి ... వాఁడు కంసారి

వీఁడు ... చక్రపాణి ... వీఁడు చక్రపాణి

ఆయది ... టంకృతి ... ఆయది టంకృతి

అది ... తథ్యము ... అది తథ్యము

ఇది + పథ్యము = ఇది పథ్యము

15. ద్వంద్వంబునం బదంబు పయి పరుషములకు గ స డ ద వ లగు.

కూర ... కాయ ... కూరగాయలు

కాలు ... చేయి ... కాలుసేతులు

టక్కు ... టెక్కు ... టక్కు డెక్కులు

తల్లి ... తండ్రి ... తల్లిదండ్రులు

ఊరు ... పల్లె ... ఊరువల్లెలు

16. ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళములగు.