పుట:Bala Neethi.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
54

బా ల నీ తి.


గామి యౌటచే నాతనిమార్గ మవలంబించిరి. ఆజనుల చేత నీబుద్ధుడు విశేషముగా గౌరవింప బడుచున్నాడు.

కాబట్టి యహింసజేయువాడు పూజ్యుడనబరగు. చెప్పువారలు చాలమందియుందురుగాని యాచరించు వారలు కడునరుదు. దూరమందుండి బావిలొ"దూకు దూకు" మనువారలుందురుకాని తాము ముందు దూకి యటుపిమ్మట ననువారలుండరుకదా. కాబట్టి మన మహింసనుజేయుచు నితరుల కదిబోధించ వలెను.నరుడు జన్మమెత్తినతరువాత గరుణ్యము లేక యుండగూడదు.మనమితరుల బాధదోలగించిన యెడల మబాధల భగవంతుడు తొలగించుచుండును. సజ్జనులు ప్రతిఫలముకోరకయే యితరులసిలుగుల బాపుచుందురు. ఎక్కువగా శరీరమంతట జెమటలు పోసి నపుడు కమ్మతెమ్మిరలు చల్లగా నాచెమటలారి పోవునటుల వీచుచుండును. అట్లు వీచుచున్నగాలికి మనమేమిప్రతిఫలము జూపించుచున్నాము? ఏమియులేదుకదా. ఇక గొందఱు దుర్మతులు ఫలమును గోరకయే యితరులకేదోవిధమున హింస గలిగించుచుందురు. ఇంగల మించుకయుగొంకక జనుల నదనముల భగ్గుభగ్గుమని కాల్చుటలేదా? ఆయగ్నికి నిటులగాల్చుటవలన నేమిలాభమో తెలియరాకున్నది.కాబట్టి వారివారినైజమని తెలిసి కొనవలసియున్నది. సజ్జనులు వీరువరనియనక వారికి దమనహాయముగా వలసియున్నయెడల దగ్గఱ జేర్చి సాయముజేసి వారిపీడపోగొట్టుచుందురు. మామిడిచెట్లు చిలుకలను, గోకి