పుట:Bala Neethi.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

53

బా ల నీ తి.


డు భూమిని దున్నునపుడు, నింకనిట్టి సమయము లందు జీవహింస జరుగుచుండును.అట్టిసమయము లయందు మనమేమియు జేయజాలము. కాబట్టి పైన దెలిపిన సమయములందు మనమేమియు జేయ జాలము. కాబట్టి పైనదెలిపిన సమయములదు దప్ప దక్కినసమయములందు బ్రాణులను హింసించిన యెడల వారు దొషబీషణమూర్తియగు గృతాంతుని లోకమ్న వచించరాని పలువిధములగు బాధలను నిక్కముగా బొందుదురు. ఇందుకు డెందమందున సందియమావంతయు నందవలసిన యవసరము లేదు. మనహింసనుజేయునరొత్తములను గౌరవింప వలెను. అహింస దామొనరించి యితరులకు బోధించిన వారు శాశ్వతంబును, జన్మరహితంబును. నానంద దాయకమును, నగు పదవినిబొంద గలరు. అట్టివారు లోకపూజ్యులు కాగలరు. అటుల లోకపూజ్యతనందిన వారలలో నొకనిని జూపించు చున్నాను.

బుద్ధుడను మహానుభావుడు సకలజనులజ్ఞా నాంధకారమునబడి గ్రుడ్దివారై తన్నుకొనులాడుచుండ వారికి దగిన యుపదేశములొనరించి హింసాభూయిష్ట ములగు కార్యములనుండిత్రిప్పి "అహింసా మరమోధర్మ" అనువాక్యములోనగు వానినిజెప్పి జ్ఞానమను వెలుగునకు దీసికొనివచ్చి యానందము కలవారినిగా జేసెను. తానహింసనాచరించి యితరులచే జేయించువాడు మహనీయుడుకదా, కాబట్టియె యీబుద్ధుడు బోధించినబోధనలన్నిటిని జనులు విని యతడు సన్మార్గ