పుట:Bala Neethi.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56

బా ల నీ తి.

లలను, రానిచ్చి తదితరములగు కాకులు మొదలగు వానినిరానియ్యకపోవుట మనము చూచితిమా? చూడలేదుకదా! కాన మనలంగోరకపోయినను నితరుల బాధపడుచుండినటుల మనముకాంచినతోడనే దయతో యధాశక్తి వారిబాధ తొలగు నుపాయమాలోచించి సౌఖ్య ముగలవారినిగా జేయవలెను.

వేదచోదితమగు హింసనుకూడ గొన్నిస్మృతులు నిషేధించుచున్నవి. ఆనిషేధముననుసరించియే రామానుజులువారును, ఆనందతీర్దులవారును, వారివారి మతము నవలంబించిన వారికి యజ్ఞాదుల యందుగూడ బశుహింసలేకుండ శాసించి యున్నారు. దీనినిబట్టి యహింసకన్న నుత్తమమగునయజ్ఞయా గాదులుకూడ గానరావని తెలియవలసియున్నది. వీరు యజ్ఞయగాదులందుండెడి హింసనుగూడ నిరసించుట వలన నహింసయే యుత్కృష్టధర్మమని తెల్లమగు చున్నది.

కాబట్టి యట్టియహింసను పైవిధమున బల్కినపగిది విధిసమయములందు దప్ప నహింస యనుదాని నవలంబించి యింకనితరులెవరైన హింసించుచున్నట్లుండిన వారిని నాహింసనుండి తగిన నద్భోధజేసి తప్పించి వారిచేతగూడ దీనినను ష్టిమజేయవలయును. మనము ప్రతిభూతమునందు దయగా నుండవలెను. ఇటుల మనముండుటవలన మన మనేకలాభముల బొందగలము.