పుట:Bala Neethi.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
52

బా ల నీ తి.


ప్రతిమనుజుడును తనవలెనే ప్రతిజీవుని ప్రతివిషయమందును సమానముగాజూచుకొనవలెను. అనగా "దనతల్లివలె నితరులభార్యలయందును, పరుల ధనముల బెంకుముక్కలుగాను, తనవలె సమస్త భూతములను నెవడు చూచుచున్నాడో వాడే పండితు" డని నీతిశాస్త్రముద్ఘోషించుచున్నది. కాన మనమితరుల వలన బాధబొందినపుడు మనకెంత యసహ్యముగా నుండునో యటులనే యితరులకుగూడ నంత కష్టముగానుండునని తెలిసికొనుడు. మఱికొందఱు కుచరితులు లేనిపోని దేవతలపేరుబెట్టి యామృగముల గొట్టి యాక్షుద్రదేవతలముందఱ బెట్టి నివేదనము బెట్టినట్టుజేసి తిరిగి ప్రసాదమని స్వీకరించి వాని మాంసమును దిట్టముగా దిని పొట్టనింపుకొనెదరు. ఇది యేమో మహాభక్తియని వీరియభిప్రాయము. కాని యది రిత్తయనినమ్ముడు మఱియు వారికి బాపముకూడ గలదని తెలిసికొనుడు.

ఈ జీవహింస కొన్నిసమయములందు దోషము కలదికాదని పందితప్రకాండులుపలికిరి. ఆసమయ ములేవియనిన? శ్రుతిస్మృత్యుక్త యజ్ఞాదిక్రవువు లందు మాత్రము విధివిహితముగా జీవహింసజేసిన నది దోషయుతముకాదని చెప్పిరి.ఈయాధారము వలన బ్రతిదేవతాకార్యమునందు జీవహింస చేయ వచ్చునని తలచెదరేమో? అటులదలచుటకు వీలు లేదు. ఆ యజ్ఞము శారీర శాస్త్రజ్ఞల నిమిత్తమై యేర్పఱుపబడినది. మఱియు సలిలము బుచ్చు కొనునపుడు, కట్టెలగాల్చు నపు