పుట:Bala Neethi.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51

బా ల నీ తి.

ము లెటులుండవచ్చును? ఈహంతకుల నెంత దూఱు చుండును? ఎంతదు:ఖించు చుండును? తెలియునా? తెలియనియెడల నీదృష్టాంతమున దెలిసికొనుడు. మన మితరుల వలన నొక పేము బెత్తపు దెబ్బెబడితిమని యనుకొనుడు. ఆదెబ్బ మనముపడిన సమయము నందు గొట్టినవారిని దూషించక విడుచుచుంటిమా? ఆ బెత్తపు దెబ్బలవలనబడిన దద్దురుగాంచి "అబ్బా! అమ్మా! " యని యేడ్చుచుంటిమే? మఱియు మనల గొట్టినవారిని మనముందుంచుకొని మగుడదన్నక యూరక పోనిచ్చెదమా? పోనియ్యము. మనమీకొంచెపు దెబ్బకే యీవిధమున నుండినపుడు నోరులేని యాపశువులు హింసపడుచు దమ్ముజంపెడి వారల నేమియు జేయజాలక స్వకీయ ప్రానముల గోల్పోవుతఱి వానిమనము లెట్లుండ వచ్చునో? వాని బాద యెంతపరిమితికలదో? యించుక యాలోచించుడు. మనము బలాభివృద్ది జేయవలయు ననిన శాకాధులు లేవా? ఘృతాదులను బుచ్చుకొనవచ్చును. మనమా పశువుల జంపినయెడల నొకవిధమగునష్టము మనకె కలుగుచున్నది. అదేదన? ఏసమయమునం దీపశువులజంపుచున్నామో యత్తఱి జలినాపెడి కంబళుగాని బలాభివృద్ది జేసెడి నెయ్యిమొదలగునవి కాని వ్యవసాయాభివృద్ది నొనరిచు పెంటలు కాని లభ్ణింపనేరవు.