పుట:Bala Neethi.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37

బా ల నీ తి.

వర్తులప్రోత్సాహమున దనకువచ్చిన యర్దరాజ్యమును శకుని మొదలగువారిచే జూదమాడించి యన్యాయము గా గైకొనినను నోర్పును విడనాడలేదు. తుదకు దమకు ధర్మపత్నియగుద్రౌపదీదేవిని గుత్సితులగుదుశ్శాసనా దులు కొప్పుబట్టికొని బటబటనీడ్చుకొంచు గురువరుల చేతను గురువృద్దులచేతను రాజులచేతను నిండియున్న సభకు దీసికొనివచ్చినను శాంతమును విడనాడలేదు. అంత నాదుర్యోధనాదు లామానినీయ మణిని దుచ్చమగుసంభాషణ నాడుటవినియు గూడ నాధర్మరాజు శాంతమునువీడలేదు. మఱియు నాదుర్యో ధనాదులామెయడిగిన ప్రశ్నలకుత్తరమియ్యక వస్త్రాప హరణము గావించుచు "నీమగలిక్కడనేయున్నారు. వారు పౌరుషహీనులుగా గనుపడుచుండిరి. అట్టివారల నీవుచేపట్టదగలదని చెప్పుచు మానభంగమొనరించు చుండిరి. దానిని విని యతని యనుజులగు భామాదు లాగ్రహావేశులయి "యిప్పుడో దుర్మధాంధులజంపి విడిచెద" మని దిక్కుల్లిపిక్కటిల్లు ఘోరరవముతొ బలికిరి. అంత నాధర్మరాజు తానుకినియక వారికి "దమ్ములారా! ఇదిసమయముకాదు. ధర్మవిరుద్ధముగా నొనరించకూడదని సామవాక్యము లు జెప్పి వారిని గ్రోధరహితులనుగా జేసి కాననము లకు సతీభ్రాతృసమేతముగావెడలెను.

   విలోకించితిరా!అట్టిమహాపత్సమయములం దోర్పును  వీడక యాధర్మరాజుండెను. కాని ఘోరము లును బరిభనకర