పుట:Bala Neethi.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
36

బా ల నీ తి.

నుగునుజూచి మొఱగుచుండ నాద్విప మాయఱపులు వినియు విననియట్లునటించి తనత్రొవను జనుటలేదా? మొఱుగుచుండుకుక్క లాకరిని నించుకైన బాధించినవి యై లాభమేమైనబొందినవా? నోరునొచ్చుటతప్ప లాభమేమియు బొందలేదనికదా చెప్పవలెను.

     కాన శాంతుడు సహించుచుండవలెను. ఈయోర్పు గలిగినవాడు సకలజనుల జక్కగా బరిపాలించు ప్రభువుతొ సమానుడని చెప్పవచ్చు. వీడే క్రియావంత మును దాల్చియుండవలెను. ఈశాంతము వహించుట వలన సౌఖ్యములుబొందగలరు. "శమస్తవ" యని వేదములు వాకొనుచున్నవి. కాబట్టి ప్రతిమనుజునికి యాచరణీయంబు.
    ఈశాంతమువలన వృద్దికివచ్చినవారలు చాలమందికలరు. వారిలో నొకనిజెప్పెద.
    సకలజనానందకరుడును, ధర్మమార్గ తత్పరుడును, సత్యవాదియు నగుధర్మరాజు తనపెద తండ్రి కుమారులగు దుర్యోధనాదులప్రొత్సాహమున ఢృతరాష్ట్రునిచేజక్కగాజూడబడకపోయినను గినియడాయె. వారు తనతమ్ముడగు భీమునికి విషాన్నము  బెట్టించినను శాంతమును విడనాడలేదు. మఱియు నతనిని బాశములచేగట్టించి నను గినుకజెందడాయె. తమ్మునాధార్తరాష్ట్రులు రాజ్యమునుంది వెడలగొట్టించినను నిదానము మానలేదు. మధ్య