పుట:Bala Neethi.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
30

బా ల నీ తి.

గతి తనకు తెలిసియు నూరకుండువాడసత్యదోషము నందర్దభాగఫలము బొందగలడు. వీడును గౌరవార్హుడు కాడు. అసత్యమనిత్యముకాన మనమెట్టిసమయము నం దసత్యమాడ కూడదుసరిగదా మనము వీక్షించుచుండగా బరులు కల్లలాడుచుండినయెడల నాపాడుబాటనుంది వారిని దప్పించుటకు యత్నించుచుండవలెను. ఒక్కొక్కసారి యసత్య వాదిత్వ వలన లాభముబొందిననుదుదకది యశ్రేయస్సునకాకరంబగు. "అది తప్పరాదు, పలికి బొంకరాదు." సత్యమాడినందువలన లాభమువచ్చి నను నష్టమువచ్చినను సంతోషించుటయె సత్తముని లక్షణము. కాననసత్యమాడుట యేరికైనను నెప్పుడైనను మంచిదికాదు.

సుదనుడొకడు ధర్మసందేహముకలిగి దానినిదీర్చు కొనుటకై పండితమండితంబగుసభకువచ్చి తనమది నున్నసందేహము దీర్పుడని యాకొవిదుల నడిగెను. అంతట వానిపశ్చితుడాతడడిగినదాని కుత్తరమొసగ బూనియు లాభముకలుగుననికాని, పిసినితనము వలనగాని, పక్షపాతముచేగాని ధర్మవిరుద్ధముగా బలికినయెడల వారనృతదోషఫలముబొందుదురు. కాన నున్నసంగతి చెప్పితీరవలయును. ఇదియే సమంజసము.

సత్యమునకుసాటియైన ధర్మము వేఱొకటిమంచి దేశానంబడదు. సత్యమాడుచుంటిన మనమున భీతియుండదు. రమణీయముగనుండును. వివేకులు సంతోషించక యుండరు. కాశిమొదలగు