పుట:Bala Neethi.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

బా ల నీ తి.

పుణ్యతీర్దముల సేవించిన నెంతఫలముకలదో యంతఫలముకలదు. నాలుగువేదములను, వనియంగములను బఠించిననెంతపుణ్యముకలదో యంతపుణ్యముకలదు. సత్యసంధత వలన గోపము, కామము, లోభము, మదము, మాత్సర్యమను నీయరిషడ్వర్గము నడగుచుండును. ఓర్పు, వినయము, శమము, మొదలగుసుగుణములు చేకూడుచుండును.

ఇదిగాక మన యార్యు లీసత్యమునునొకతపస్సుగా గణనజేసిరి. ఈతపమునాచరించినవారి కిహలోకమున సమస్తైశ్వర్యములు కలుగుననియు బరమున స్వర్లోకమున నివాసము కాగలదనియు వచించిరి. "సత్యమేవజయతి, నానృతం" అనగా "సత్యమే జయించు న్నది, అనృతముజయించుటలే" దని యుపనిషత్తులు పలుకుచున్నవి. ఒకపరి మనమన ములకు సత్యమాడుటవలనలాభములేక నష్టమున్న టుల దోచినను దుదకదిశ్రేయస్సునకు మూలకంబుగా బరిణమించును. నిత్యమగుసత్యమును బలుకువారు మృతజీవులు కాగలరు.

అటులమృతజీవులై వాసిగన్నవారిలో నొకనిజెప్పెద-

మున్నాహరిచంద్రమహారాజు సత్యమాడుయందు నిరుపమానుడని భూతలమున వాసిగాంచియుండెను అంత నింద్రలోకమున, మునులు సింహాసనాసీనులై యుండ నాయింద్రునిచే, భూతలమున నెల్లపుడు సత్యమాడు వారెవరని ప్రశ్నవచ్చెను. దానికి ససిష్టుడను నొకముని హరిశ్చంద్రుడని యుత్తర మొసగెను. అంతట విశ్వామిత్రుడు క్రోధోల్లసితమూ