పుట:Bala Neethi.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29

బా ల నీ తి.


తే.గీ."విద్యయొసగును వినయంబు♦వినయమునను
       బడయు బాత్రత పాత్రత♦వలన ధనము
       ధనమువలనను ధర్మంబు♦దానివలన
       నైహికాముష్మికసుఖంబు♦లందు నరుడు."

సత్యము.

సత్యమనగా నితరులచే జెప్పబడినదికాని వినినది కాని తానుజూచినదికాని యున్నదానిని నుడువుటయే.

ఇటుల జెప్పబడినవిషయమందును, వినినవిషయ మందును, గనినవిషయమందును, బుదిపూర్వక ముగా దాఱుమాఱుగా లేనిపోనివి కల్పించి చెప్పుట యసత్యమనబడు.

ఈయసత్యము బలుకువా రవినీతులు, వీరు చెప్పువాక్యముల నెవరును విశ్వసించరు విశ్వసింపక పోవుటవలన దమకాశ్యకములైన పనులన్నియు జెడిపొవును. చెడినతోడనె యలజడుల గుందుచు దరిగానక యుండుదురు. దీంచ్వలనగ్రమముగా మనోవ్యాధి జనింపగలదు. ఈమనోరోగమువలన మృతిజెందిన జెందవచ్చు. ఈయసత్యమాడువారు ఘోరనరక వాసులై యుందురు., "అసత్యమాడుట బ్రహ్మహత్యతో సమాన" మని పండితప్రకాండులు నుదివిరి. తన్నునెవరైన నొకధర్మవిషయమును గురించి నడిగినయెడల