16
బాలనీతి
గా నాశీర్వదించెను. ఈకవ్వడి, గురుభక్తిఁజూపుట యీసమ యమునందే కాక యుత్తర గోగ్రహణమందుఁగూడఁ జూపె ను. ఆయర్జునుఁ డుత్తరకుమారునికి "బృహన్నల" యనుమా ఱుపేరుతో సారథ్యంబు సల్పుచుఁ గారణాంతరమునఁగ్రమ ముగాఁ దాను రథికుఁడై గాండీవాదుల ధరించి యదివఱకుఁ బ్రచ్ఛన్న వేషంబుతో విరటుని కొలువునందుండుటంబట్టి ప్ర తి పక్షికోటిలోనున్న గురువరునకు నమస్కారంబుఁ జేయుట కు వీలులేక నమస్కార సూచక భాణంబుల నాగురు వరుని పాదారవిందములవంకఁబ్రయోగించెను. అందులకాగురుఁ డమి తముగా సంతోషించెను. దాన నీకిరీటి యాయుత్తరగోగ్రహ ణమందు జయంబత్యద్భుతంబుగా నందెను. మఱియు నీగురు భక్తివలనఁ గలిగిన నీధనంజయుని మహిమ మఱియొండుకల దు. అది వినుఁడు, భారతయుద్దాన సానంబున బుత్త్రఘాతి యు, ద్రోణాచార్య తనూభవుండును, నగు నశ్వత్థామకు నీ యర్జునునకుఁ గలహముసంభవించెను. క్రమక్రమముగా నాక లహముప్రబలి యొకరిపైనొకరు బ్రహ్మశిరోనామ కాస్త్రం బులఁ బ్రయోగించుకొనిరి. అంత నక్కడనుండు మహామును లెల్ల నీకల్లోలమునుగాంచి వీరిఁజేరి "మీయస్త్రంబులు బ్ర హ్మశిరోనామకంబులు లోకంబుల దహించఁగలవు. కాన మీ మీయస్త్రంబుల నుపసంహరింపుఁ" డని పలికిరి. అంత వారియ నుమతిని నర్జునుఁడుమాత్రము తనయస్త్రము నుపహరించెను. అటుపై నశ్వద్ధామ తన యస్త్రము నుపసంహరింపలేక తన మన