పుట:Bala Neethi.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

బా ల నీ తి.

మున "నాకవ్వడి యెక్కువ గురు భక్తి కలవాడగుటవలన వాయుస్త్రము నుపహరింపగలిగెను. నేనాధనురా చార్యుని పుత్రుడనయ్యు నంతగురుభక్తి లేకపోవుటవలనగదా యుపహరింప జాలనైతి" నని కుందెను.

   తిలకించితిరా! ఆయర్జునుడు గురువువద్దవిద్యనభ్యసించి క్రమముగా నతనికన్న నెక్కుడు బలవంతుడయ్యునాతనియందు భక్తికలవాడగుటవలనగదా తాను లోకవిఖ్యాతుడైనది. మఱియు నతని గురుపుత్రుడుకూడ నుపసంహరింపలేని యస్త్రమును గురుభక్తికలవాడగుట వలన గదా యాయర్జునుడుపసంహరింప గలిగెను. కాబట్టి యట్టులనె పత్రివారును గురుభక్తికలిగియుండిన యెడల వారికి మేలుకలుగును. కాన మున్నెట్టులైనను మనమీదినమునుండి యీవిధమున నుండుదము.

క. సగ్గురుకృప జ్ఞానంబున
    సద్గతిదీవించుచున్న చాలగజదువుల్
    సద్గతిగలుగంజేసెడి
    సద్గురువేడై వమనుజాటర వేమాడి

రాజభక్తి

మనలను సుఖముగా బరిపాలించురాజులయందు భక్తి గానుండుట రాజభక్తియనబడును.