పుట:Bala Neethi.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

బా ల నీ తి

ద్రోణాచార్యులను నొకసుప్రసిద్ధ ధనురాచార్యుడు ధృతరాష్ట్రపాండు నందనులకు జక్కగా ధనుర్విధ్యాదులను జెప్పెను. అంత నాధార్తరాష్ట్ర పాండవేయులు, గురువుదగ్గఱకు వచ్చి "స్వామీ! మేము మీకు గుదక్షిణ నీదలచితిమి. కాన దమకేది యిష్టమో తెలియగోరెదము. అని పల్కిరి. అంతట నాగురువు "చాత్రచూడామణులారా! మీబుద్దికిమెచ్చితి.ఇదుగొ నాకోరిక వినుడు. పాంచాలదేశాధీశుడును, మిత్రపరాబవ కారియు నగు నాద్రుపదుని బట్టుకొని పాశములచే గట్టి మీయరదమున బెట్టికొని వచ్చి నాముందఱ బెట్టుటయే నాకు గురుదక్షిణ. ఇటుల జేసినవాడే గురుభక్తి కలవాడని పలికెను. దానికి వారందఱు వల్లెయని మహోత్సాహముతో నాద్రుపదుపురంబునకు జనిరి. అందున మొదట దుర్యోధనాదులహమహమికచే నట్టిప్రయత్నముజేసిరి కాని వారాపాంచాలపతితన యాదులచే నోటువడి స్వగృహాభిముఖులైది. అంతట బాండవమధ్యముండగు నర్జునుండు ధైర్యస్దైర్యములు కలవాడై తా జేయుప్రయత్నమున కడ్దువచ్చినవారందఱిని దుక్కుదూళిగగొట్టి యాద్రుపదునిగట్టిగగట్టి తనరధమున నిడుకొని వాయువేగమున దన యొజ్జ యెదుటికి దీసికొనివచ్చి "ఇదుగోయితడే ద్రుపదు డని యచట నునిచెను. అంత నాగురు వాసవ్యసాచియొక్క బాహుబలమునకును, దనయందుండు భక్తికిని మెచ్చి యెక్కువ