పుట:Bala Neethi.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

11

బా ల నీ తి.

ముగా సంతోషమందుచుండును తండ్రియందు భక్తికల వాడైయాతనిని సంతసమందించినవాడే కుమారుడు తక్కినకుమారులు జనకమారకులని చెప్పవచ్చు. జనకహర్షప్రదాతయగు గుమారుడనెక లాభముల బొందగలడు.

అటుల పితృభక్తిగలిగి లాభముల బొందినవారలలో నొకనిని జూపెద.

భారతవీర శ్రేష్ఠుడని వాసిగాంచిన గాంగేయుడు తనతండ్రియందు భక్తిగలవాడై యుండెను. ఇట్లుండ నొకపరి తనతండ్రియగు శంతన మహారాజునకు దాశరాజపుత్రికయగు యోజనగంధిపై మోహము జనించెను.అతడామెను వివాహమాడుటకు దాని తండ్రి కడకు జని తనమనోరధమునుదెలియబఱచెను. అంత నాదాశరా "జీపిల్లకు జనించిన పిల్లనికి నీరష్ట్రమంతయు బట్టముగట్టినట్లొడమబడితివేని నొసగెదని పలికెను. అంతనామహారాజు తన పెద్దకుమారుదలచి మిన్నకుండి యింటికిజేరి డెందమున గుందు చుండెను. ఇవ్విధమున దనతండ్రి యుండుట నొక సమయమున గాంచి యతని యాంతరంగిక మిత్రు లను విచారించి కారణముదెలిసికొనెను. అంత దానా దాశరాజుదరి కరిగి "నీకొరినయట్లె యీనతికి జనించిన కుమారుడు రాజదురంధరుడు కాగలడు. ఇందుకుసందియమంద నవసరములేదు. వైళమెన" తండ్రికి నీకొమరైతె నిచ్చి వివాహంబొనర్చుము. నాతండ్రి చింతవిడనాడి సుఖముగానుండిటయే నాకు బ్రధానముకాన