పుట:Bala Neethi.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

12

బా ల నీ తి.

నిదుగో బ్రహ్మచర్యంబుబూనితి" ననిదృఢప్రతిజ్ఞజేయ నాతనిపై నాకసమునుండి దేవతలు పుష్పవృష్టి గురిపించిరి. అంతట దాశరాజు నతని పితృభక్తికి మెచ్చుచు దన కూతును శంతనునకిచ్చి వివాహం బొనర్చెను. అంత నాశంతనమహారాజు తనకుమరుని ప్రతిజ్ఞకును, సద్భుద్దికిని, భక్తికిని, ననంతముగా నద్భుతమంది మదిని మెచ్చి యాతనికి స్వచ్చంద మరణము బ్రసాదించెను.

చూచితిరా! ఆభీష్మాచార్యుల పితృభక్తి కలవాడగుటచేతనేకదా బాణములవలనగాని కత్తులవ లనగాని మఱియొక దానిచేగాని మృతిజెందక తన యిష్టమువచ్చినప్పుడు విధివశమగు వరమును బొంద గలిగెను. అట్టివరముల నితరులు పొందగలరా? పొందలేరు. కాబట్టిపితృభక్తి గలిగినవారలు పెక్కు ఫలములుబొందగలరు. కాన మనము మనతండ్రి మొదలగు పూజ్యులయందు భక్తిగా నుండుదము.

క.జనకుడు దపమునుధర్మం
   బును విద్యయుబరమదైవ♦మును గావున
   తనికిబ్రియంబగుపనిసే
   సినదేవతలెల్లబ్రీతి♦జెందుట గలుగున్

భారతము.