పుట:Bala Neethi.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
158

బా ల నీ తి.

మనోజ్ఞముగానుండెను. ఈతడభినవ "పండితరాయ" యని బిరుదమునంది యున్నవాడు.

    ఇతనితరువాత వైదికబ్రాహ్మణుడును, లక్ష్మీపుర గ్రామమవాసియగు గోపీనాధము వేంకటకవి వేంకటగిరి సంస్ధానమందాస్ధానకవివరుడై వాల్మీకి రచితరామాయణ మును, మాఘకవికృత శిశుపాలవధ మహాకావ్యంబును, బ్రహ్మకైవర్తపురాణస్ధ కృష్ణజన్మఖం డమును, భగవదీతను నాంద్రీకరించెను.అంతట నాసంస్ధానాధీశు లీతనికవనమునకు మెచ్చి యగ్రహార మొసంగిరి. ఈతనికవనము పండితపామరబోధకంబగు మనోహరశైలికలదై లలితముగా నుండును.
    ఈతెలుగు బాసయందు సుప్రసిద్ధకవులింకను చాల మందికలరు. కాని గ్రంధవిస్త్గరభీతిచే వారినివిడిచిపెట్టి వ్రాసితిని.
    మనపూర్వకవులకు బద్యకవనమునమందు న్నంత ప్రేమ గద్యకవనమందు గన్పడదు. కాని యిటీవలబాలకావ్యాకరణప్రణేతయగు పరవస్తు చిన్నయసూరి మనోహరశైలిని వచనరచనజేసెను. ఈతనినీతిచంద్రిక కడుసొగసుగా నుండును. ఇతనిబాల వ్యాకరణమాధునికకవులకు  గొందఱ కుపకారమొనర్చుచున్నది. ఈచిన్నయసూరని వచన రచన చతురుడని పలుకనగు.
     ఇటుల హృద్యంబగు నీతెనుగుబాసను మనమెక్కువగా గౌరవించవలెను. మనమాతృబాష యెప్పుడభివృద్దిబొం