పుట:Bala Neethi.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

159

బా ల నీ తి.

దునోయప్పుడె మనమబివృద్దికిరాగలము. రాజకీయభాషల మనమభ్యసించు చుండినను మన భాషవిడనాడక యభిమానముగా దానియందుండ వలెను. దానిని బూజించుట మనతల్లిని బూజించు టయె యనినమ్ముడు. మనమ మొదట తెలుగు పండితులన్ గౌరవించవలెను. వారిచే గ్రంధముల జేయించవలెను. అటుల మనబాసయభివృద్దిజేయ సమకట్టిన మనముగూడ విద్వాంసులము కాగలము. అంతటగ్రంధములరచించి కీర్తిమంతులము కాగలము.

   ఇటులవృద్దిజేసి కీర్తిజెందిన వారలలో నొకరిని జెప్పద.
    క్రీ.శ.11వ శతాబ్దమున రాజరాజనరేంద్రుని వేడికోలు మీద నన్నయచే సృజింపబడిన యాంద్రకవితను 15వ శతాబ్దమందున్న కృష్ణదేవరాయలుచేకొని తన యాస్ధాన మందున్న కవులచే బోషణజేయించుచు రమారమి నూటికంటె నధికముగా గ్రంధములరచింపజేసి  యాగ్రంధకర్తలను సత్కరించెను. అటుపై నాశ్రీకృష్ణదేవరాయలు విద్వాంసుడై యాముక్తమాల్యదయను గ్రంధరాజమును రచించెను. తదుపరి కీర్తనీయుడాయను. 
    చూచితిరా!ఆకృష్ణదేవరాయలు తాను మహారాజు నని యీతెలుగుబాసను నిర్లక్ష్యముచేయక చేరదీసి  యాంధ్రపండితుల నెక్కువగా గౌరవించుచుండెను. అందువలనెకదా యనర్ఘంబులగు నూఱుగ్రంధములు బయలు