పుట:Bala Neethi.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
156

బా ల నీ తి.

     ఇతనికి దరువాత 15వ శతాబ్దమందున చొక్కన కుమారుడును, నియొగిబ్రాహ్మణుడును నగు నల్లసానిపెద్దన శ్రీకృష్ణదేవరాయాస్దాన ప్రధానపండితుడై హరికధాసారము, స్వారొచిషమను చరిత్రములను రచించెను. ఈకవి రచించినవానిలోనికి మనుచరిత్రమె మిక్కిలి వన్నెకెక్కినది. ఈతనిబూర్వమందున్న కవులు సంస్కృతకోశముల నాంధ్రీకరించుటయె కాని విపులీకరణముగా నొకగ్రందమైనరచించియుండలేదు. కాని యితడు మార్కండేయ పురానమునుండి కధను గైకొనిపెంచి మనుచరిత్రప్రబంధమును రచించెను. కాబట్టియె యాంధ్రకవితా పితామహుడని బిరుదము నందెను. ఈకవి కవనము శ్రొత్రనీయమై శృంగారాది రససమన్వితమై యుండును.
   ఇతనికి సమకాలికుడగు పింగళిసూరన యుభయ భాషాకొవిదచూడామణియై రాఘవపాండవీయమును, గళాపూర్ణోదయమును, గరుడపురాణమును, ప్రభావతీ ప్రధ్యుమ్నమునింకను గొన్ని గ్రంధముల రచిచించెను.ఈతనిరాఘవపాండవీయము శ్లేషకావ్యమైనను గ్లీష్మార్దములు లేక సులబశైలిలొ బహురసపరముగా నుండును.
    ఈకవికించుమించు సమకాలికుడగు రామరాజ భూషణుడు వసుచరిత్రయను శ్లేషకావ్యమును మనుచరిత్ర ననుసరించి తిరుమలదేవరాయలను గృతినాయకునిగా నొనరించి రచించెను. ఈయన కవన మర్దగంభీర్యముకలదై యమకా