పుట:Bala Neethi.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

155

బా ల నీ తి.

     ఈ 14వ శతాబ్దమందెభారద్వాజసగోత్రజుడును, నాపస్తంబమాత్రుడును, మారయ్యపుత్తురుడును నగుశ్రీనాధుడు మహాకవియై మరుత్తరాజ చరిత్రము, పండితారాజ్యచరిత్రము, శాలివాహన సప్తశతి, నైషధము, భీమపురాణము, కాశీఖండము, వీధినాట కము, హరవిలాసము, పల్నాటివీరచరిత్రమను ద్విపద కావ్యమును మున్నగుగ్రంధములను రచించి యాంధ్రభాషా పోషితుడాయెను. ఈకవికవిత్వము నిర్దుష్టమై సంస్కృతపద వ్యావృతమై దీర్ఘసమాసములు కలదై యనేకాలంకరమణీయమై రమ్యముగానుండును.
    ఈకవికి సమకాలికుడును, బావమఱదియునగు బమ్మెరపోతన కౌండిన్యగొత్రజ కేతనపుత్త్రుడై మహా కవియైయుండెను. ఈకవి సంస్కృతభాగవతమును రెనిగించెను. ఈతనికవనము శబ్దలంకార విరాజితమైన పదలాలిత్యము కలదియై భక్తిరస ప్రధానమై యొప్పు చుండును. ఇతదు భగవంతునియందవ్యాజ భక్తి కలవాడు. ఈకవి  వీరభధ్రవిజయమను మఱియొక గ్రంధమును రచించెను. ఈకవి తాను రచించిన గ్రంధమును శ్రీరామస్వామికంకితముజేసెను. ఈభాగవతమును గారణాంతరమున గొన్నిభారములుత్పన్నములై పోయెను. ఆభాగములను గంగన, సింగన, నారయ యనువారలు పూరితిజేసిరి. ఈబాగవతగ్రంధము నందక్కడక్కడ రేఫశకటరెఫములకు బ్రాసాద్లు చెల్లించుటవలన బూర్వలాక్షణికులు దీనిని లక్షణగ్రంధముగా బరిగణించరైరి.