పుట:Bala Neethi.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
19]

145

బా ల నీ తి.

శకము 730 వ ప్రాంతమునగలడు. ఈతడు మహాకవి యై మాలతీమాధవము, మహావీరచరితము, ఉత్తర రామచరితములను మూడునాటకములను రచించెను. అందున నుత్తరరామచరితము కడుసొగసని కోవిదు లనెదరు. ఈమహాకవి రచించిన నాటకములన్నియు నీతియుతములై శ్రోత్రపేయములై తనరారుచుండును.

    ఇతనితరువాత మురారియను మహాకవి యనర్ఘరాఘవమను పేరిట నొకనాటకముల్ను రచించెను. ఈనాటకము శబ్దశాస్త్రనిపుణులకును, నిఘంట్వాది పరిశోధకులకును, గ్రాహ్యమగునది గానుండి శ్రీరామచరితతొపేతమై నయయుతమై చదువరుల కింపునింపుచుండెను.
   ఇతని తరువాత బహుకాలమునకు మల్లినధుడను మహాపండితుడు కోలచలవంశము నందు జనించిచతుష్షష్టి  కలావిశారదుడై పంచ కావ్యంబులకును, శ్రీహర్షకృత నైషధ మహాకావ్యం బునకును, మఱియుగొన్ని నాటకములకు గించిద్జ్జ్ఞబోధకంబగు సులభశైలిని వ్యాఖ్యానముల రచించి కవిబావముల జక్కగా దెలియ బఱచుచు "మహామహోపాధ్యాయ"బిరుదమును విద్వాంసులచే గొని సంస్కృతవాజ్మయ విమర్శకులనెల్ల నంద నీయుడై వన్నెకెక్కెను.
    హూణశకము 1550 వ సంవత్సరమున విశ్వవిఖ్యాతయగు రంగరాజ మఖి కప్పయ్యదీక్షితు డను సుధీవరుడుద్భవమంది దురాచారముల నాశనమొనరించుచు నద్వైతమత