పుట:Bala Neethi.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
148

బా ల నీ తి.

దేశములనుండి పండితులువచ్చి సరసకవనంబు సెప్పిన వారిని మెచ్చుకొనివిశేషముగాగౌరవించి ధనమిచ్చి నిజరాజధానియగు ధారానగరమునందె వారిని నివసముగలవారినిగా నొనరించుచుండెడివాడు. ఇట్లీరాజు చేయుటవలన గడజాతి వాడును సంస్కృతభాషను గవనముజెప్ప గలగాడయ్యెను. ఆసమయమున నిదేభాష దేశబాషగా మాఱినదని చెప్పవచ్చు. ఈవిధముగా దనరాజ్యమంతయు నుండుట వలన మనమున నానందమందు చుండెను. తాను విద్యావంతుడగుటవలన సరస్వతీకంఠాభరణ మను గొప్పయలంకారగ్రంధమును, రామాయణచంపు వును రచించి గీర్వాణము నభివేద్దిజేయుచు లోకసంన్త వనీయుడాయెను.

        చూచితిరా! ఆవిక్రమార్క మహారాజు ధన్వంత ర్యాది కవీశ్వరులను గౌరవించుటవలననె కదా లోకోప కారకగ్రంధములుబయలు వెడలినవి. అవివెడలుట వలననెకదా యామహారాజుకీర్తి దిగంతముల వ్యాపించగలిగెను. మఱియు భోజమహారాజు పందితులగౌరవించి వారిచే గ్రంధముల రచింపజే యుటయె కాక తానొకగొప్పయలంకార గ్రంధమును, స్వాద్యపద్యగద్య చంపువును రచించుటవలననె కదా యామజారాజు నిప్పటికి జనులు కీర్తించుచున్నారు. కాబట్టి మనము నదసద్విమర్శనసాధన భూతంబును,. యోగవేదాంతవైద్యవిద్యాహృద్యం బును, నగుసంస్కృతసాహిత్యమందు సాహిత్యమును సంపాదించి పండితప్రకాండుల సత్కరించుచు న