పుట:Bala Neethi.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
(18)

137

బా ల నీ తి.

హర్షులకుపదేశించెను. పిమ్మట నీయారుర్వేదము ధంవంతరి, శుశ్రుత, అగ్నివేశ, చంకాదిపారంపర్యగా నుపదేశింపబడుచు వృద్ది చేయబడుచుండెను.

    ఈపై జెప్పినవారలందఱు వైధ్యగ్రందములను రచించి లోకోపకారకులై , ఈగ్రంధములలో మిక్కిలివన్నె కెక్కినవి చరక శుశ్రుతమహామునులవలన రచింపబడిన చరకసింహిత శుశ్రుతసంహితయను కబ్బములుమాత్రమే. అందున మొదటిది చరకసంహిత,   ఇది 8 భాగములుకలదై యున్నది ఇయ్యదికాయ చికిత్సలజక్కగా దెలియబరచును. ఈవిషయముననిది యె యుత్తమము. రెండవదియగు శుశ్రుత సంహిత 8 భాగములుకలదైయున్నది. ఇది శస్త్రచికిత్సలగుఱించి మిక్కిలి చక్కగా దెలియబరచుటయందు బేరెక్కియు న్నది. శస్త్రచికిత్సల(సర్జరి) విషయమై తెలియబఱచుట యం దుత్తమోత్తమిదియె. ఇటులనిప్పటిపాశ్చాత్యులు గూడ గొనియాడి యున్నారు. మఱియు వారు మనగ్రంధలలో వచించిన వైద్యమునుగొంతవఱకు జేయుచున్నారని చెప్పవచ్చు. అరేబియావారు మనయార్యులేర్పర్చిన యాయుర్వేద మార్గముననురించియు గొన్నిగ్రంధముల భాషాంతరీకరణము జేసికొనియు "యునాని" యనుపేరనౌషధముల వాడుచున్నారు. ఇటులనె మనయాయుర్వేదమతరీతిగానె ప్రవర్తించి యారోగ్యవంతులమగుదము.