పుట:Bala Neethi.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
136

బా ల నీ తి.

ట. కోపము, మనోవ్యాకులత లోనగువారిని చేర్చకుండ నుండుట. మత్తుపేదార్దములను బుచ్చుకొనకుండ నుండుట. మలమూత్రాదుల నడ్డగించకుండుట. దుర్వ్యాపారములు లేకయుండుట. మితసంభోగము కలిగియుండుట రాతిరియందుజామునకులోగా భోజనముచేయుట. దినమునకాఱుగంటలు మాత్రము మంచిగాలివచ్చు కిటికీలను దెఱచి నిర్మలమగు గృహమున శయనించుట లోనగునవి.

    ఈమర్గమునను మనము నియమముగా సంచరిచ వలెను. అటులచేసిన మనమరోగ్యమును బొందగలము. ఇటుబైజెప్పిన మార్గముల  నాలంబిపక పోతిమేని మనము రోగులము కాగలము. ఆరొగములను రూపుమాపుట కౌషధములున్నవికాని యామార్గములకు భిన్నముగానడచి రోగులమేల కావలయును? "అడుసుద్రోక్కనేల, కాలుకడుగనెల." 
     కాబట్టి యాయారోగ్య మార్గముననె నడచి బలవంతులమగుదము. ఇటుల నాయారోగ్యమార్గ మున నడచినను దైవవశమున నప్పుడప్పుడు కొన్ని రోగములు వచ్చుచుండును. వానికిదగిన చికిత్సలను మనవారింతకు బూర్వమె యేర్పాటు చేసిరి. 
    ఆయారోగ్య విషయికచికిత్సలు గలదాని నాయుర్వేదమనియనెదరు. ఈయాయుర్వేదమును దొలుత గమలాసనుండు దక్షప్రజాపతికిని, దక్షప్రజాపతి, సూర్యపుత్రులగు నశ్వినీదేవతలకును, వీరుసహస్రాక్షునకును, ఈయన యాత్రేయాదిమ