పుట:Bala Neethi.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

133

బా ల నీ తి.

లకన్న నుడుతనెక్కువగా నాదరించితివి. సతతము నీధ్యానములొనుండెడి వామదేవాది మహర్షులతో సమానముగా బక్షికిగూడ మోక్షమొసంగితివి. నీసోదరుడగు భరతునికన్న బడవలనడుపు గుహుని కుశలమును ముందుగా నారసితివి. గొప్పవారలిడు విందుతో సమానముగా శబరిభక్తితో నిచ్చిన యెంగిలి పండ్లను మక్కువతో మెక్కితివి. పిత్రాజ్ఞనుబరిపాలించి తివి. గురువరాదులయెందెక్కువ భక్తితోనుంటివి. ధైర్య సాహసములతో లోకమునుపీడించు వారిమక్కడ గించితివి. శిష్టులరక్షించితివి. జనులను ధర్మముగా సుఖముగా బరిపాలించుచుంటివి. ఆహా! ఏమినీసద్భా వము, వీరకరుణాళుత్వము, నిన్నునుతింపనేను శక్తురాలనుకాను. నేడునిన్నుజూచుటవలన నేధన్యు రాలనైతిని దుర్జనశిక్షజేయుటకై యీవిధముగా జన్మించితివి. కాన నావిన్నపమాలకింపుము. నేనీపురి యందు జిరకాలమునుండియు నితరులకపకారము నొనరించకసంచరించుచుంటిని. నేటిదినమున నొక బిక్షకుడు నన్నుగ్రోధముతొ నాశిరము పగులునటుల గొట్టెను. కానదయచేసి విచారణజేయు" మని విన్నవించుకొనెను. అంతట రాముడు వెంటనేభటులచే నాభిక్షుకునిబిలిపించి "దీనినేలగొట్టితి"వని ప్రశ్నించెను. దానికాభిక్షకుడు "అయ్యా! నేనూరూరనింటింట దిరిగితిరిగియలసి ఇంటికివచ్చుసమయమున నిదిదారికడ్డముగా నుండి కదలకపొవుటవలన గొట్టితిని. కాన నిక మీయిష్టము వచ్చినట్లు దండించవచ్చు"నని యుత్తరమొసగెను. తరువాత రాము డాతనినిదం