పుట:Bala Neethi.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
132

బా ల నీ తి.

ష్టములుజెప్పు కొందమనివచ్చిన జనులులేరుకాని యొకకుక్క మాత్రము తననెత్తురు గార్చుచుబోరున నేడ్చుచువచ్చి యుండెను. దానినీలక్ష్మణుడుచూచి "ఏమి నీతలకేఅపదగలిగిన"దని కారుణ్యముతో నడిగెను. కానియాభవక మాతనితో "దిక్కులేనివారికెల్ల దిక్కైన యారాజచంద్రునితో నాసంగతిజెప్పెదను. కాని నీకుదెల్ప" నని వచించెను. అంత లక్ష్మణుడు "మంచిద"ని కొలువులోనున్న తనయన్న సన్నిధికరిగి "స్వామీ మీయాజ్ఞాను సారముగావాకిటిలోనికి జనివిచారించితిని. అచటమాయేలిక వలనమేము సుఖముగానున్నామని వచించుజనులుతప్ప నితరు లెవరును గానరారు. కానియొకశ్వాసస్ము మాత్రమేడ్చు చు వాకిట నిలువబడియున్నది. ఏమిసంగతియని దాని నడిగితిని. కానియది మీరుదప్ప నితరులకు దనసంగతి జెప్పనని చెప్పినది. తరువాత దేవర యాజ్ఞ"యని వినయపూర్వకముగా బల్కెను. అంత నారాముడాతనితో వెంటనేదాని ప్రవేశపెట్టుమని యనెను. అంతట లక్ష్మణుడు మరలనేగ యాకాలేయ కముతొ నిన్నుబిలుచుకొని రమ్మనిదేవరయాజ్ఞయైన దనిచెప్పెను. అంతట నది "ఏమీ? నన్నురమ్మనెనా? భూదేవతలును, మునులునుండెడి గొప్పసభకు రమ్మని పిలుచుటేమి చతురత్వము" అని వాక్క్రుచ్చెను. దానిని విని యీలక్ష్మణుడు తనయన్నకు దెలియబఱచెను. అంతనాశ్రీరాముడు తానెవచ్చి యాకుక్కనుజూచి "ఏమిసంగతి" యని యడిగెను. అంతనది "రామచంద్రా" నీవుబలిష్టులగు వానరు