పుట:Bala Neethi.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

125

బా ల నీ తి.

యుపన్యాసకుని వాచాటునిగాను, సద్విమర్శకుని రంధ్రాన్వేషణ తత్పరునిగాను, బరిగణించుచుందురు.

    వీరలు నిష్కారణముగా గొప్పవారలను బీడించుచుందురు. కనవునీరుమదలగువానిచే బ్రతుకుచేపలను నిష్కారణముగా బోయవాడు పీడించుటలేదా?
   ఇట్లు నిష్కారణముగా బెద్దలని పేరుగాంచిన వారిని జిక్కుల జిక్కించుట కడునన్యాయము. వీరలు యమగదానుగ్రహపత్రులు కాగలరు.
    ఈదుర్జనులు తమపని కొనసాగనియెడల నత్తఱిప్రాక్తన ఫలమిదియని తెలిసికొనక దైవమునుదొక్రుచుందురు. ఇటుల దూఱుట “తుంటిని గొట్టినపండ్లు విరిగిన“నను లోకోక్తిసరిపోవుచున్నది. వీరలు గురిగింజవలె దమదప్పుల దాముదెలిసికొనక యితరుల తప్పులవెదకు చుందురు. ఈకుమతులకు దైవవశమున గొంచెమున్నత పదవిలభించెనేని “నికనాకేమిరా“ యనిగర్వించి తమక్రిందివారలను నెక్కువగా వీరలు వేధించుచుందురు. ఈకుచరితులు, దైవమునందును, రాజునందును, జననీజనకులందును, మహాపతివ్రతయగు భార్యయందును, సద్గురునందును విశ్వాసహీనులై వారిని దృణీకరించుచుందురు.
   ఈదుర్మార్గులకు, విధ్య, ధనము, బలము, నీమూడు సుగుణములు మదోద్రేక కరములగుచున్నవి. ఇవియెసుమతులకు సాధుత్వ మార్గదర్శకములు.