పుట:Bala Neethi.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
124

బా ల నీ తి.

గాన్పించినను నమ్మగూడదు. వీరినినమ్మియుండుట "కుక్కతొకబట్టుకొని గోదావరియీదుటయె" మఱియు వీరికి సాయముజేయుట "పామునకుబాలుపోయు టయె"

   "అతివినయంధూర్తలక్షణ" మ్మనగా దూర్తుని యొక్కలక్షణ మతివినయమనియర్దము. కాన సామాన్యముగా మిక్కిలివినయమునటించువారు దుర్జనులైయుందురని చెప్పవచ్చును.
     ఈవినయములు తమభార్యలు మహాపతివ్రత లైనను సంతానవతులైనను, సౌందర్యవతులైనను, సద్గుణవతులైనను, సరకుసేయక యాయమ్ముల ననాదరణదృష్టితో జూచుచుందురు. వీరలు తమయుద్దేశ  మగునంతవఱకు గడుప్రియులవలె నటించి పిమ్మట విషపూరితంబులగుకోరలుగలిగిన సర్పముమాస్కి నాశనముజేయజెలరేగుచుందురు. ధైర్యమువీడి భయముకలవాడై తమ్మును గొనియాడు చువచ్చి శరణాగతుడగు నతిధినిగాని యభ్యాగతిని గాని యీకుచరితులు నిర్దయులైవారల జంప నుంకించుచుందురు. అధికప్రసంగములేక యభిమాన ధనులైయుండు  పెద్దమనుష్యుల నీదుర్మార్గులు మందులుగా భావించుచుందురు. సద్వ్రతమునందు శుచికలవాడై యొకడుండుటగాంచి వానిని వీరు "అబ్బా!లేనిపోని యీదంబాచారములెందుకో? తెలియకున్న" దని యీసడించుచు: బల్కుచుందురు. శూరుని నిర్దయునుగాను, మునిమ్రుచ్చుగాని, బలవంతునిగర్వవంతునిగాను, మంచి