పుట:Bala Neethi.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
126

బా ల నీ తి.

     సుజనులేదేని యొక మంచికార్యమును జేయుచుండిననీ కుచరితులు దానినెటులైన నాగింపవలె నను యుద్దేశముతో విశ్వప్రయత్నము లొనరించు చుందురు. ఇతరుడు గొప్పదశలో నున్నాడని వినిన సహించక యీదుర్మార్గులాదశ నుండి వానిని దొలగింప జేయుటకుద్యమించు చుందురు. ఎదుటివారిప్రొయ్యి చక్కగా మండుచుండిన, దానిని జూడలేక తనప్రొయ్యిలో నీళ్లుపోసికొనినాడట" యనులోకోక్తివిన లేదా?
      ఈదుష్టులు లోకాపవాదకు భయపడరు. బొంకుటకు గొంకరు. గురుదారలనైన నంటుటకు జంకరు. సురాపానాదుల జేయుటకు శంకించరు. లోభత్వమున గ్రోధమున దగ్గియుండరు. కృతజ్ఞత యెట్టిదోయెఱుగరు. జూదమాడుటకతిశ్రద్ధకలవారు. వీరు చేయుపనుల వేఱువేఱుగా జెప్పనేల? ఈకుమతులకు జెయదగని పనియేలేదు. వీరలు తేనెపూసిన కత్తుల వలె బ్రకాశించుచుందురు. వీరలు బ్రతివాడును, దమవలెనుండుటకు బ్రయత్నముల జేయుచుందురు. "తాజెడ్డకోతివనమెల్ల జెఱచె" నను లోకోక్తి వినవె? ఈదుర్జనులుపైకి మేడిపండువలె మేలిమిగా గానుపించినను లోపల జూడ వారిశరీర మంతయు విషమయమై యుండును. పాములకు గోరలయందును, తలయందీగకును, దేలునకు గొండియందును, దుర్జనులకు నిలువెల్లను విషము కలదని పెద్దలుచెప్పగ వినలేదా? దుర్మార్గులు విద్వాంసులైనను విడువదగినవారలు, ఎ