పుట:Bala Neethi.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

123

బా ల నీ తి.

టికి మాటికిని బొంకులాడుచు బ్రతిజ్ఞలుసేయుచు బ్రమాణములుజేయుచు నితరుల నమ్మించుటకై యనేకవిధముల బాటుబడుచుందురు. వీరలు, తమ పని యెవనివలనగొనసాగవలెనో యది తెలిసికొని వానిని జేరి ప్రణామములాచరించి మిక్కిలి తిన్నని మాటలతో మాటలాడుచు బయోముఖవిషకుంభముల బాతి బాసిల్లుచు గపటవినయముజూపుచు విశేషముగా నాతనియందు భక్తికలవారుగా నటించి యాసుజనుని వలన దమపనిగొనసాగించుకొనుచుందురు. అంత నీకు జనుల తమపనినెఱవేర్చినవారలనే కృతఘ్నతకలవారై పలు తెఱగుల భాదించుచుందురు. ఈకుమతులు సధ్యమైనకొలది నితరులను దమచేతజిక్కించుటకె యత్నింతురు. ఒకవేళ వారు తమచేతులజిక్కనిచో వేడికోలుచేనైనను జిక్కించుకొందురు. "అందినశిఖయు నందకున్నగా" ళ్ళని వినియుండలేదా?

   ఈకుచరితు లాదిని దమపని కొనసాగునంత వఱకు గడువినయముగానుండి పిమ్మట మేమే శ్రేష్టులమని నిక్కుచుందురు. వీరికుపకారమొన రించినవారెదలో "ఏకుమేకయినదే" యని చింతించు చుందురు. కాబట్టి దుర్జనుల కెవరైనను సాయము జేయగూడదని తెలిసికొనుడు. ఈదుర్మార్గులకొకపరి మంచిబుద్ధిపుట్టినటుల గానుపించినను వారిని నమ్మగూడదు. పాపటకాయ పైకిబాగుగా గానుపించి నను లోపలిచేదుయెచటికరుగును? కాననొకపరి వారు మనకు మంచివాడుగా