పుట:Bala Neethi.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
122

బా ల నీ తి.

యాద్రోణా చార్యుడు చేకొనకపోయినను విలువిద్య యందు శ్రద్ధకలవాడగుట బట్టియేకదా స్వకీయజన మును విడిచి భయంకరమగు నడవికేగి మన్నుతో నాద్రోణుని రూపమునుజేసికొని దానినె గురువుగా దలచికొని శ్రద్ధతో స్వయముగా నేర్చుకొని త్రిలోకము లందు విలువిద్యయందు దానె మేటియని ప్రసిద్దికెక్క గలిగినది. ఆప్రసిద్ధినివిని యొకడాయర్జునుడును ద్రొణుడును నంతపని జేసినది. కాబట్టి శ్రద్ధనుబట్టి విద్యయుండును. ఒకవిద్యయే యననేల? సమస్తము నీశ్రద్ధనుబట్టియే యుండును. కాన మనము శ్రద్ధవలన విద్యాదులబొంది ప్రసిద్ధి బొందుదము.

క. శ్రద్ధ రవితనయ సాత్వికి
    బోద్ధవ్యా వాస్తిశుభము♦బొనరించుమన
    శ్శుద్ధి స్వరూప దాని బ్ర
    బుద్ధుడు పాటించు జూవె♦పురుషాత్మికగన్.

(భారతము.)

దు ర్జ ను లు, వా రి గు ణ ము లు.

     చెడ్డగుణములుకలవారు దుర్జనులని చెప్పబడు దురు.   ఈదుర్జనులు విద్యావంతులైనను బలవంతులైనను ధనాడ్యులైనను గులీనులైనను త్యాజులు. ఎందువలననన? వీరుచేయుచేతలబట్టి వారు చేయుచేతలెవ్వియనిన? మా