పుట:Bala Neethi.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
120

బా ల నీ తి.

   ఇటుల శ్రద్దవలన బ్రసిద్దివహించినవారలు చాల మందికలరు. వారిలో నొకనిని జూపించుచున్నాను.
  
   మున్ను "హిరణ్యధ్వన్వు" డను నెఱుకరాజునకు గొడుకగు "నేకలవ్యు" డనువాడు, ద్రోణాచార్యుల ప్రసిద్ధిని విని యాయాచార్యుల సమీపమునకువచ్చి "ధనురాచార్యా! నేనుశ్రద్ధగా దమసమీపమున ధనుర్విద్య నేర్చుకొనవలయునని యిష్టపడుచు న్నాను. కాన నన్ననుగ్రహించుడనికోరెను. అంత ద్రోణాచార్యులు, వానినిబోయవానికుమారునిగా నెఱింగి వానివేడికోలు నంగాకరింపకబోయెను. అంత నా యేకలవ్యు డాయాచార్యుల యానతిగైకొని యడవికేగి యొకచో గూర్రుండి మృత్తికతొ ద్రోణాచార్యరూపమును జేసికొని దానినె గురువువాభావించుకొని నమస్కారాదు లసలిపి మిక్కిలిశ్రద్ధతో నెల్లప్పు డస్త్రవిద్య నభ్యసించు కొను చుండెను. అంతట నొక సమయమున నాయడవికి గురుకుమారులందఱు భటసమూహమునం దొకనికుక్క ప్రత్యేకముగా నొకడె మిక్కిలిపట్టుదలతో ధనుర్విద్యనభ్యాసంము జేసికొనుచుండెడి నాయేక లవ్యునిజూచి మొఱిగెను. అట్లు మొఱుగుట నా యేక లవ్యుడు చూచి యాకుక్క మొగమున నైదుబాణము లను, నొకయమ్మును వేసెను. ఆబాణములు, దూరముగానున్నకురు కుమారుల సమీపమునకు బాఱెను. దానిజూచి వీడెవడో కనుగొంద