పుట:Bala Neethi.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

119

బా ల నీ తి.

శ్ర ద్ధ.

     తాననుకొనినకార్యము నెఱవేఱువఱకు బట్టుబట్టి యుండుట "శ్రద్ధ" యనబడును.
    ఈశ్రద్ధయనునది ప్రతికార్యమున కత్యావశ్వకైమై నది. ఇదిలేనియెడల నేపనియు గొనసాగదు. మిక్కిలి బుద్ధిమంతులుకూడ నీశ్రద్ధ నవలంబింపవలసి యున్నది. వీరవలంబించనయెడల దామనుకొనిన కార్యము నెరవేఱదు. విద్యార్ధులులీశ్రద్ధనవలంబింపని యెడల వారికి విద్యరాదని దృఢముగాజెప్పవచ్చును. మంచినిక్కుటద్దములైనను వెనుక గళాయిని బొందనియెడల నితరుల ప్రతిబింబముల జూపగలవా? లేవు. అటులనె యెవరెంతగొప్పవారైనను శ్రద్ధను బూననియెడల నేమియుబ్రయొజన మందనేరరు. విద్యార్ధులీశ్రద్దనెతాల్చినయెడల విద్య జక్కగస బొందగలగు. శ్రద్ధకొలది విద్య వచ్చును. కాన విదార్దు లందఱు తప్పక దీనిని గల్గియుండవలెను. మతిమంతుడు తాను చలనములేక శ్రద్ధకలిగియాలొ చించుచుండిన వానికిలాబముగల యొకయుపా యము తోచును. ఇట్లాలొచించుసమయమున  దనమనము చలనమొందుచుండెనేని నిక్కమగు లాభముగల యొకయుపాయమును గ్రహింపనేరడు. కాబట్టి విద్యార్ధులు, మంత్రులు, గార్యారంభకులు, తప్పక యీశ్రద్ధనుగల్గి యుండవలెను. దాన బ్రతిష్ట బొందగలరు.