పుట:Bala Neethi.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
(10)

121

బా ల నీ తి.

మని యల్లన నేయేకలవ్యుని జేరిరి. అంతనిద్దఱొక మొగము నొకరు చూచుకొనిరి. అంతట నా యేకలవ్యుని దృష్టికి శరలాఘవంబునకు మెచ్చుకొని "నీవెవ్వడ" వని వానినడిగిరి. అంతట వాడు నేను హిరణ్యధన్వుకొమరుడను. ద్రోణాచార్యులశిష్యుడను న "న్నేకలవ్యు"డని లోకమువాకొనుననియుత్తర మొసంగెను. అంతట నా కురుకుమరులంద ఱటనుండి బయలుదేఱి ద్రోణునిసమీపమున జేరి జరిగినసంగ తంతయు నివేదించిరి. మఱియు నర్జునుడొకనా డేకాంతమున దన గురువుదరిజేరి "గురువరా! విలుదిద్యయందు నన్నుబ్రసిద్ధునిగా జేసెద నని యిది వఱకు వచించియుంటిరి. నేనడవికి మొన్నటిదినము పోయినప్పుడు నిన్ను నన్నును మించినధనుర్విద్యా విశారదుని నొక యెఱుకను జూచితిని. వాడు నీశిష్యు డట. నాతోనానావిధముగజెప్పి యీవిధముగమీరు చేయుటపాడియా"? యని యడిగను. అంత ద్రోణు డాయర్జునునితొ "వానిజూతముర"మ్మని యిద్దఱు కలిసి యడవికరిగి యాయేకలవ్యుని దరి జేరిరి. అంత నాయెఱుక యాద్రోణాచార్యుని గాంచి నమస్కరించి స్వామీ! మీశిష్యుడను. మిమ్మారాధించి యింతవాడ నైతిని. కాన గురుధక్షిణ నివ్వదలచితి. కాన గోరు" డనిపలికె. అంత నాద్రోణు డాయెఱుకను బొటనవ్రేలిని గురుదక్షిణగానిమ్మని కోరెన్. అంత నాయెఱుక యటులనె చేసెను.

   చూచితిరా! ఆయేకలవ్యుడు తన్ను బోయవాడని