పుట:Bala Neethi.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
90

బా ల నీ తి.

     అమూల్యములగు బాల్యయౌవనములుగడచి వార్దక్యమువచ్చినను నాసమత్రమువిడనాడక యుందురు. ఈ యాశకంతమేలేదు ఇట్లంతములేని యాశ మనముగలిగియుండగూడదు. కలిగినయెడల నిడుములబడగలము. ఇటుల దురాశవలన నిడుములబడినవారల కొందఱు కలరు. వారిలో నొకనిని జెప్పుచున్నాను.
   తొల్లి దుర్యొధనమహారాజు దురాశచే బిన్నవారలను, దనపినతండ్రికుమారులను నగుధర్మరాజాదులకు భాగమెగవేయదలచెను. అందువలన దగినపటోపాయ ముల ననేకములు జేసెను. అవియన్నియు వ్యర్దము లాయెను. తుదకు ధర్మాత్ములగు నాధర్మరాజాదులను జంపనెంచెను. అందునకు దగినదురాలోచనము దురాత్ములతోడ నొనరించి తనతండ్రినే నాధర్మరాజాదులు కాశీపట్టనమునకుజనునటుల వారికి జెప్పించెను. తదుపరి యదుర్యోధను డావారణావతమున ధర్మరాజాదులు నివసించుటకై తననెచ్చలియగు వురొచనునిబిలిచి రహస్యముగా వానితో "నీవు ముందుగా గాశీపట్టణమునకుబోయి నయనాభిరామ ముగా నొకలక్కయిల్లుగట్టుము. మఱియు నీవుకట్టిన లక్కయింటిలో వారేమఱి కాపురముజేయుచుండు తఱి నాయింటికి జిచ్చుపెట్టి వారిని దగ్దులనుగా జేయు" మని పంపెను. అంత నతడటులసేయుటకు జని లక్కయిల్లు సొగసుగాగట్టి సిద్ధముగా నుండెను. తరువాత ధర్మరాజాదులు తమ పెదతండ్రిగారి యానతిని శిర