పుట:Bala Neethi.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
(12)

89

బా ల నీ తి.

టికి నిరసించుచున్నాను. కారణమేమన? ఈదురాశ, విషవృక్షముతొ సమానముకాబట్టియే!. విషవృక్షతుల్య మగు నీదురాశను గోరినవారల కది విషఫలముల నిచ్చుచుండును. వానిని దినినచ్వారలగతి జెప్ప, వ్రాయ, నలవిగాదు.

    ఈదురాశ, యొకతల్లికిబుట్టిన కొమరులను విడదీయుచున్నది.  వారలను న్యాయసభలకెక్కించు చున్నది. అంతవారిచే సొమ్మునంతయు నమ్మొనరింప జేయుచున్నది. మఱిల్యు తండ్రికొడుకులకు దలపట్లు పట్టించుచున్నది. జనులయైకమత్యమును ధ్వంసము సేయుచున్నది. ఇది,యది, యననేల? ఈదురాశ, సుఖములనెల్ల జిటికలో బాపి యనేకకష్టముల జేయించగలదు. ఓకవేళ మనము దురాశకులొంగి చేయదగనిపనుల జేసిన నవి మననాశనమునకె కారణములగుచుండును. దురాశ గలిగిన వారలకు దృప్తియుండదు. దృప్తిలేనివారల కొకకాసైన (పైసలో 5 వవంతు) నివ్వగూడదు. ఒకసమయమున నిచ్చినను నది బూడెదలో నాజ్యముబోయుటయె యగును. దురాశగలిగినవారలు, తమసామర్ద్యముల తుఱ్తెఱుగక గొప్పగొప్పపనుల జేయ నుంకించు చుందురు. ఇటుల బ్రయత్నించుట "అందనిమ్రాని పండ్లకు నఱ్ఱులుజాచుటయె" యగును. దానివలన నితరులనగుబాటుకు లోనగుచుందురు. మఱియు నవమానముల కొడి గట్టవలసివచ్చును.